Sidebar


Welcome to Vizag Express
సుందరీకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలి *శోభ యాత్ర అత్యంత వైభవంగా ఏర్పాటు

29-01-2025 10:30:59

సుందరీకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలి

*శోభ యాత్ర అత్యంత వైభవంగా ఏర్పాటు

*రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి,28: శ్రీకాకుళం పట్టణం సుందరీకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మున్సిపల్ అధికారులను ఆదేశించారు.  వచ్చే నెల 2, 3, 4 తేదీల్లో జరుగనున్న రథసప్తమి వేడుకల సందర్భంగా కొత్తరోడ్డు నుండి అరసవల్లి వరకు జరుగుతున్న సుందరీకరణ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లతో మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  డివైడర్ లలో గ్రీనరీ ఏర్పాటు చేయాలన్నారు.  ముందుగానే విద్యుత్ ఫోల్స్, విద్యుత్ కనెక్షన్ వైర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 
డే అండ్ నైట్ వద్ద జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు. వచ్చే నెల 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 4.5 కిలో మీటర్ల వరకు శోభా యాత్ర నిర్వహిస్తామన్నారు. యాత్ర ముందు ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేశారని కలెక్టర్ ను అడుగగా శకటాలు, కోలాటం, తప్పెటగుళ్లు, కర్రసాము, కొమ్ము డాన్స్, తదితరమైన కార్యక్రమాలు ఉంటాయని మంత్రికి కలెక్టర్ వివరించారు. అక్కడ నుండి చేరుకొని ఏడు రోడ్ల కూడలి వద్ద బ్యూటిఫికేషన్ గూర్చి చర్చించారు. మిల్లు జంక్షన్ వద్ద జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. జంక్షన్ వద్ద షాపులు తీసి ప్రస్తుతం ఉన్న షాపుల స్థానంలో నంబర్లు వేసి పక్కా షాపులు నిర్మించి నంబర్లు వారీగా ఎవరివి వారికి షాపులను అప్పగించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను ఆదేశించారు. మిల్లు జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్న డివైడర్ పనులను పరిశీలించి మద్యలో గ్రీనరీ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. సూర్య నారాయణ స్వామి వారి దేవస్థానం వద్ద ఏర్పాట్లు గూర్చి ఎఈ మంత్రికి వివరించారు. అరసవల్లి లో సుందరీకరణ పనులను పరిశీలించి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. రథసప్తమి వేడుకలు ఎప్పుడూ ఒకరోజు మాత్రమే జరిగేవని, ప్రస్తుతం మూడు రోజులుగా నిర్వహణ జరుగుతుందన్నారు. గతంలో రథసప్తమి వేడుకల అంటే భయంతో వచ్చే వారని, ఈసారి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాకు వచ్చి అందరు నిర్భయంతో దర్శనం చేసుకోవచ్చునని, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా ప్రకటించిందని, జిల్లా కలెక్టర్ అహర్నిశలు శ్రమించి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.  మిల్లు జంక్షన్ వద్ద 12 రకాల సూర్య నమస్కారాలు జరుగుతాయన్నారు. సూర్యనారాయణ స్వామి శోభా యాత్ర 4.5 కిలోమీటర్ల డే అండ్ నైట్ జంక్షన్ నుండి అరసవల్లి వరకు జిల్లా కలెక్టర్ చాలా బాగా ఏర్పాటు చేశారు. మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆముదాలవలస జంక్షన్ నుండి అరసవల్లి దేవస్థానం వరకు జరుగుతున్న పనులను పరిశీలించి 
శ్రీకాకుళం రూపు రేఖలు మారనున్నాయన్నారు. 
పిపిపి పద్ధతిలో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. 
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ప్రతీ ఇంటికి ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 
సూర్య నారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రసాదం స్కీం కింద వంద కోట్ల రూపాయలు మంజూరైనట్లు చెప్పారు. నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఓఎన్జీసి, తదితర వాటి ద్వారా జిల్లాకు నిదులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి తీసుకువస్తారని వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అరసవల్లి దేవస్థానం ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నట్లు వెల్లడించారు. 
భోగాపురం ఎయిర్ పోర్టు 2026 జూన్ నాటికి పూర్తి అయితే ఈ ప్రాంతం రూపు రేఖలు మారతాయన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు జరుగుతోందన్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ కు 12 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకువచ్చినట్లు వివరించారు.
     ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్, రెవెన్యూ డివిజనల్ అధికారి కె. సాయి ప్రత్యూష, ఆర్ అండ్ బి ఎస్ఈ జాన్ సుధాకర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, ఎస్ఈ సుగుణాకరరావు, డిఆర్డిఎ పిడి కిరణ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి బి. శాంతి శ్రీ, డిపిఓ భారతి సౌజన్య, సూర్య నారాయణ స్వామి దేవస్థానం ఈవో భద్రాజి, తదితరులు పాల్గొన్నారు.