ఫిబ్రవరి 2న రాష్ట్ర స్థాయి డెల్టా పోటీ పరీక్ష
తెర్లాం వైజాగ్ ఎక్సప్రెస్ న్యూస్ జనవరి 29:-ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు రాస్తున్న పదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 2 న ఆంగ్ల భాష ప్రతిభా పాటవ పోటీ పరీక్ష లను బొబ్బిలి రాజా కళా శాలలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆంగ్లభాష ఉపాధ్యాయుల సంఘం ( డెల్టా) అధ్యక్షుడు ఎం విజయ మోహన్ రావు తెలిపారు.నందబలగ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆయన మాట్లాడుతూ..
ఈ ఏడాది ప్రైవేటు మినహా అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల 250 మంది ఏ గ్రేడ్ విద్యార్థులుహాజరవుతున్నారని తెలిపారు. పదవ తరగతి ఆంగ్ల భాష పాఠ్యాంశాల పై నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 20 స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి, ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు, ప్రశంస పత్రాలు, మెమొంటోలు అందజేస్తున్నామని తెలిపారు.
పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంస పత్రాలు, మెడల్స్ ఇస్తున్నట్లు వివరించారు.
మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు,
బొబ్బిలి నియోజకవర్గం శాసనసభ్యులు బేబీ నాయన, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల విద్యా శాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారులు , ఆంగ్ల భాషా ఉపాద్యాయులు హాజరు అవుతున్నారని తెలిపారు.
గత 14 ఏళ్లుగా .. ఈ పోటీ పరీక్షలను బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు బేబీ నాయన సహకారంతో నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ సమావేశంలో డెల్టా ప్రతినిధులు
గంట సత్యనారాయణ, చింతల తిరుపతి, తేలు అప్పారావు, పుప్పాల సాంబశివరావు పాల్గొన్నారు.