Sidebar


Welcome to Vizag Express
బుధవారం పశు ఆరోగ్య శిబిరాన్ని ఆత్మ చైర్మన్ కనిమెరక కృష్ణ ప్రారంభించారు

29-01-2025 21:09:08

చీపురుపల్లి రూరల్ / గుర్ల, వైజాగ్ ఎక్సప్రెస్ న్యూస్ జనవరి 29: గుర్ల మండలం గరికివలస గ్రామంలో బుధవారం పశు ఆరోగ్య శిబిరాన్ని ఆత్మ చైర్మన్ కనిమెరక కృష్ణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ "కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటినుండి పశువులపై దృష్టి సారించడం చూస్తున్నాం. గోకులం షెడ్లు నిర్మాణాలు, ప్రస్తుతం ఆరోగ్య శిబిరాలు చేపట్టడం వాటి ద్వారా పశువులకు వాటి నివాసాల వద్దకే సంచార పశు ఆరోగ్య సేవా కేంద్రాల వాహనాలను ప్రారంభించామన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తీసుకువస్తున్న అభివృద్ధి పథకాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి సతీష్, పసుశిబిరానికి తీసుకువచ్చే ఆవులకు గేదెలకు నట్ట నివారణ, చూడి నిర్ధారణ పరీక్షలు, నిర్వహించారు. పశువులపై రైతులకు తగు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి సన్యాసమ్మ, మాజీ ఎంపీటీసీ కే అప్పలనారాయణ, కూటమి నాయకులు పాక రాణి, నాగమల్లిక, కే.శ్రీరామ్మూర్తి, కే.రమేష్, గ్రామ పెద్దలు పశు వైద్యాధికారులు, రైతులు పాల్గొన్నారు.