యువత సైబర్ నేరాలు పట్ల,చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి: గిరిజన యువత చదువుపై శ్రద్ధ చూపించి మంచి భవిష్యత్తు పొందాలని ఎస్సై జె రామకృష్ణ అన్నారు.
గంజాయి సాగు, రవాణా, సారాయి, వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే కుటుంబం అందరితో సుఖసంతోషాలతో ఉంటామని లేకపోతే జైలు జీవితం గడిపే పరిస్థితి నెలకొంటుందని ఆయన తెలిపారు. మండలంలోని రంగాబయలు పంచాయితీ కేంద్రంలో బుధవారం ఆయన తమ సిబ్బందితో పలు గ్రామాలలో పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి బాట నడవాలంటే మావోయిస్టులకు దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత వారిపై ఆకర్షితులు కాకుండా జాగ్రత్త పడాలని ఆయన తెలియజేశారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, సారాయి త్రాగటం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ ఆన్లైన్ క్రైమ్ మోసాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగాల పేరిట మోసాలు చేసే వారిపై జాగ్రత్తగా ఉండాలని పలు సలహా సూచనలు అందించామన్నారు. చెడు వ్యసనాలకు లోనై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న ఆస్తిపాస్తులు అమ్ముకునే స్థితికి రాకూడదు అన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువచ్చిన ఎడల సంబంధిత అధికారులకు తెలిపి సమస్య పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది గ్రామ పెద్దలు యువతి యువకులు తదితరులు అధిక సంఖ్యలు పాల్గొన్నారు.