Sidebar


Welcome to Vizag Express
గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

29-01-2025 21:17:40

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి 

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి:29: పీఎం జన్మన్ గృహా లబ్ధిదారులు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని  గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ అధికారి బి బాబు అన్నారు. మండలంలో కిలగాడ పంచాయతీ తడిగిరి గ్రామంలో బుధవారం ఆయన తమ సిబ్బందితో గ్రామంలో  పర్యటించారు. నిర్మాణ దశలో ఉన్న గృహాలను పరిశీలించారు. గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని అప్పుడే బిల్లులు త్వరితగతిన పూర్తి చేయాలని అప్పుడే తమ ఖాతాలో జమ అవుతుందని ఆయన తెలిపారు. మండలంలో 3400 గృహాలు మంజూరు చేసామన్నారు. పిఎంఏవై గ్రామ సడక్ యోజన పథకం ద్వారా అర్హులైన వారి దగ్గర జియో టాక్ చేస్తున్నామన్నారు. లబ్ధిదారులు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, వంటి, జిరాక్సులు తీసుకొని సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఏఈ సిహెచ్ కృష్ణారావు, సిబ్బంది కే కృష్ణారావు, హేమలతలతో పాటు గృహ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.