Sidebar


Welcome to Vizag Express
ట్యాంక్ బండ్ అభివృద్ధి ప్రతిపాదనలపై స్పీకర్ అయ్యన్న సమీక్ష

29-01-2025 21:21:18

ట్యాంక్ బండ్ అభివృద్ధి ప్రతిపాదనలపై స్పీకర్ అయ్యన్న సమీక్ష: నర్సీపట్నం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29:
నర్సీపట్నం పెద్ద చెరువు ట్యాంక్ బండ్ ను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే పనులు వేగవంతం అవుతున్నాయి. ఈమేరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు  బుధవారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో ట్యాంక్ బండ్ అభివృద్ధి ప్రతిపాదనలపై ఆర్ అండ్ బి, పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.గత ఏడాది నవంబర్ 21న అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఇరు శాఖల అధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి స్పీకర్ కు వివరించారు. ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో ఆయా శాఖలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలకు పంపించాల్సిందిగా స్పీకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం స్పీకర్  అధికారులతో కలిసి పెద్ద చెరువు ప్రాంతాన్ని సందర్శించారు. పార్కింగ్, టాయిలెట్ల నిర్మాణాలు, విగ్రహాల ఏర్పాటు మొదలైన అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆర్ అండ్ బి శాఖ డి.ఇ. విద్యాసాగర్, ఏ.ఇ. నారాయణరెడ్డి, టూరిజం శాఖ డి.ఇ. స్వామి, ఈ.ఇ. రమణ, ఏ.ఇ. సీతారాం తదితరులు పాల్గొన్నారు