స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డీఎస్పీ శ్రీనివాసరావు: నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29:
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ను ఆయన క్యాంప్ కార్యాలయంలో నర్సీపట్నం సబ్ డివిజన్ డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోతిరెడ్డి శ్రీనివాసరావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నర్సీపట్నం ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలని అయ్యన్న సూచించారు,అలాగే పట్టణ ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.చింతపల్లి పోవు ప్రధాన రహదారిలో ఎక్సైజ్ స్టేషన్ వద్ద,గంజాయి కేసుల్లో పట్టుబడిన వాహనాలు అక్కడ వృధాగా ఉంచడం వలన అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఆ వాహనాలు అక్కడ నుంచి తీసే చర్యలు చేపట్టాలని, స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. డి ఎస్ పి శ్రీనివాసరావు తో పాటు, రూరల్ సిఐ రేవతమ్మ, టౌన్ సిఐ గోవిందరావు ఉన్నారు.