నిరుపేద విద్యార్థులకు ఎన్.ఆర్.ఐ వాసవి అసోసియేషన్ ఆర్థిక చేయూత:
నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29:
విద్యావంతులైన నిరుపేదలకు ఎన్నారై వాసవి అసోసియన్(యు.ఎస్.ఎ) వారు, ఇద్దరు విద్యార్థులకు 1,51,500 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.
ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న మెట్టపాలెం గ్రామానికి చెందిన పెనుగొండ మహాశ్వేతకు 75 వేల రూపాయలు,అలాగే బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న నర్సీపట్నం నకు చెందిన దంగేటి శర్వాణి కి 76,500 రూపాయల చెక్కులను
నర్సీపట్నం డి.ఎస్.పి పోతిరెడ్డి శ్రీనివాసరావు చేతులమీదుగా విద్యార్థుల తల్లిదండ్రులకు బుధవారం అందజేసారు. నర్సీపట్నం ప్రాంతంలో నిరుపేదలకు ఏరకమైన కష్టం వచ్చినా ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవడంలో వెలగ నారాయణరావు ముందుంటున్నారు. ఎంతో కాలంగా నారాయణరావు ఈ ప్రాంతంలో,వివిధ వర్గాల ప్రజలకు అందిస్తున్న అనేక రకాల సేవలు పట్ల పట్టణ ప్రజల మన్ననలు పొందుతున్నారు.అలాగే నారాయణరావు అందిస్తున్న సేవలు పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు,అధికారులు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్. ఆర్.ఐ వాసవి అసోసియేషన్ ప్రతినిధి, ఆర్యవైశ్య మహాసభ స్టేట్ బోర్డు మెంబర్,వాసవి క్లబ్ రీజినల్ చైర్మన్ వెలగా నారాయణరావు,ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి సుతాపల్లి శ్రావణ్, ఆర్యవైశ్య మహాసభ అనకాపల్లి జిల్లా వైస్ సెక్రెటరీ, వాసవిక్లబ్ అధ్యక్షులు నాళంరమేష్ కుమార్,
నర్సీపట్నం వాసవి వనిత క్లబ్ ఉపాధ్యక్షులు నాళం కళావతి, సెక్రటరీ కేదారిశెట్టి విజయలక్ష్మి, వెంకునాయుడుపేట మున్సిపల్ వార్డుకౌన్సిలర్ పెదిరెడ్ల చింతు పాల్గొన్నారు.