Sidebar


Welcome to Vizag Express
మౌలిక సదుపాయాల కల్పనకు మూడు కోట్ల 90 లక్షల మంజూరు. --- గంటా సహకారంతో పనుల మంజూరు దాసరి

29-01-2025 21:35:12

మౌలిక సదుపాయాల కల్పనకు మూడు కోట్ల 90 లక్షల మంజూరు. --- గంటా సహకారంతో పనుల మంజూరు దాసరి. 
మధురవాడ, వైజాగ్ ఎక్స్ప్రెస్ :
ఆరో వార్డులో అభివృద్ధి పనులకు భీమిలి శాసనసభ్యులు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు  ఆదేశాలతో సుమారు మూడు కోట్ల 90 లక్షల రూపాయలు మౌలిక సదుపాయాల కల్పనకు, సుమారు 12 పనులకు టెండర్స్ ఆమోదం చేయడం జరిగిందని ఆరవ వార్డ్  టిడిపి అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. వార్డులో చాలాకాలంగా ఎదురుచూసిన పనులకు శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉందని వ తులసి నగర్ వాకర్స్ పార్కు దగ్గరనుండి పైకి రోడ్డు, పీఎం పాలెం ఆర్ఆర్ కళ్యాణమండపం నుండి మాలతాంబ స్కూల్ వరకు సీసీ రోడ్డు,గాయత్రి నగర్ వద్ద గల పార్క్ అభివృద్ధి,. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, స్మశాన వాటికి ప్రహరీ గోడ నిర్మించడానికి,, హెచ్పీసీఎల్ లేఔట్ నందు రోడ్ నెంబర్  వద్దకు రోడ్డు, లలిత దేవి గుడి వద్ద మరో రోడ్డు, అలాగే బక్కన పాలెం పరిసర ప్రాంతాల్లో ఆరు రోడ్లు డ్రైన్స్ కి మూడు కోట్ల 90 లక్షలతో వర్కులు, మంజూరయ్యాయని తెలిపారు.