Sidebar


Welcome to Vizag Express
సంక్షేమ పథకాలకు శానిటరీ వర్కర్లు దూరం

29-01-2025 21:36:38

సంక్షేమ పథకాలకు 
శానిటరీ వర్కర్లు దూరం గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 29,                    జివిఎంసి 74వ వార్డు పారిశుద్ధ్యం కార్మికుల మస్తర్ పాయింట్ వద్ద జనరల్ బాడీ సమావేశం మధ్యాహ్నం  2గం ,. లకు జరిగింది. జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గాజువాక జోన్ కమిటీ గొలగాని అప్పారావు (జనరల్ సెక్రెటరీ) పాల్గొని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకం గ్యాస్ సబ్జిడీ ఇవ్వటం లేదు. ఎకౌంట్లో డబ్బులు పడటం లేదు. ఎంప్లాయ్ అని ఒకే ఒక కారణం. జివిఎంసి అధికారులచే ఎంప్లాయ్ కాదు ఔట్ సోర్సింగ్ (ఆప్కాస్) వర్కర్ అని సర్టిఫికెట్ తీసుకొని సివిల్ సప్లై ఆఫీస్కు వెళ్ళి  ఎంక్వయిరీ చేయగా ప్రభుత్వం నుండి  పారిశుద్ధ్యం కార్మికుల కోసం గ్యాస్ సబ్జిడీ  అమలు చెయ్యాలని ఎటువంటి  సర్కులేరు రాలేదు అని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. పారిశుద్ధ్యం కార్మికులకు కూటమి ప్రభుత్వం స్పందించి అవార్డులు, రివార్డులు కంటే  కనీస వేతనాలు చెల్లించాలని 12వ పి ఆర్ సి విడుదల చేసి సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. గొలగాని అప్పారావు, కొండమ్మ, సంతోష్, రామకృష్ణ తదితరు.