అగనంపూడి పునరావాస కాలనీలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు స్థలం పరిశీలన
గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 29,
. అగనంపూడి పునరావాస కాలనీలో 16 గ్రామాలు 30 వేల జనాభా జనజీవనం సాగిస్తున్న ప్రాంతంలో సర్వీసులు పెరిగి విద్యుత్తు లోవోల్టేజ్ వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకొని వెళ్ళగా ఆయన ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ ఈ కి లేఖ వ్రాయిగా వారు సానుకూలంగా స్పందించి స్థలము కేటాయించినట్లయితే సబ్ స్టేషన్ నిర్మాణం చేపడతామని వారు చెప్పారు స్థల విషయం ఇటీవల రెవెన్యూ సదస్సులో అర్జీ పెట్టగా ఎమ్మెల్యే కూడా గాజువాక తాసిల్దార్ కి చెప్పగా ఎమ్మార్వో తోట శ్రీవల్లి ఆదేశాల మేరకు గాజువాక రెవిన్యూ కార్యాలయం వీఆర్వో, సర్వే, పినమడక శివాలయం వీఆర్వో అగనంపూడి పునరావాస కాలనీ డొంకాడ గ్రామం దారి సర్వేనెంబర్ 208/2 లో 40 సెంట్లు స్థలము ఉన్నదని చెప్పారు. అగనంపూడి రిస్కో సెక్షన్ కార్యాలయము డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాసరి శివ శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ 40 సెంట్లు స్థలము ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి సరిపోతుందని చెప్పారు. రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ స్థల విషయం తాసిల్దార్ కి చెప్తామని వారు తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పారు. రెవెన్యూ అధికారులు మహేష్ శ్రీనివాసరావు ధనలక్ష్మి రామారావు స్థానిక టిడిపి నాయకులు కొర్రయి జగదీష్ గోడ్డి గురుమూర్తి బండారు చందు రమేష్ గంతకోరు సత్యవతి జనసేన పార్టీ నాయకులు మరుడిపూడి మణికంఠ తదితరులు పాల్గొన్నారు