Sidebar


Welcome to Vizag Express
దివ్య స్వర్ణిమ రథ యాత్ర ప్రారంభం.

29-01-2025 21:41:11

దివ్య స్వర్ణిమ రథ యాత్ర ప్రారంభం.

గాజువాక - వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి29


సోమనాదేశ్వర వజ్ర లింగ రథ యాత్ర ను 72 వ వార్డు కార్పొరేటర్ ఏ.జె .స్టాలిన్ బుధవారం ఉదయం ప్రారంభించారు . బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యం లో ఉడా కాలనీ శాఖ పర్యవేక్షణలో బుధ వారం అంగ రంగ వైభవంగా సోమ నాద్రుని రథ యాత్ర ప్రారంభం అయ్యింది . కార్పొరేటర్ స్టాలిన్ తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఈశ్వరీ య పతాకాన్ని ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రస్తుతం నైతిక విలువలు పడి పోయి దుఃఖ. అశాంతి లు నెల కొన్నాయని అన్నారు 
ప్రజలకు నైతిక విలువలను పెంపొందించేందుకు బ్రాహ్మకుమారీ లు చేస్తున్న సేవలు అమోఘమని అన్నారు . ఇంకా ఈ కార్యక్రమంలో డా. హేమలత, న్యాయ వాది అండి బోయిన లక్ష్మి , డా.పంకజ్ , రథ నిర్వాహకులు సుభాష్ , గాజువాక ఇన్చార్జి బి.కె మణి, ఉడా కాలనీ ఇన్చార్జి బి.కె శాంతి , శ్రీనివాస రావు ,నందికి తాత రావు , సిపిఐ నాయకులు అప్పా రీ విష్ణు మూర్తి, జి. ఆనంద్ పాల్గొన్నారు