Sidebar


Welcome to Vizag Express
వెల్లంకి పంచాయతీలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం ఆనందపురం

29-01-2025 21:42:49

వెల్లంకి పంచాయతీలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

 ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్ జనవరి 29.


   ఆనందపురం మండలంలో వెల్లంకి గ్రామపంచాయతీలో  ఉచిత పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ శిబిరానికి హాజరైన డిప్యూటీ డైరెక్టర్ పశు సంవర్థక శాఖ ఎమ్.చంద్ర శేఖర్  మరియు చినగదిలి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సజ్జ శ్రీనివాసరావు  హాజరు అయ్యారు. డిప్యూటీ డైరెక్టర్  మాట్లాడుతూ బహువార్షిక పశుగ్రసల పెంపకం పథకం గురించి వివరించారు, అదే విధంగా దూడ పెయ్యలుతో పాటు పెద్ద పశువులు అన్నింటికి నట్టలు నివారణ మందులు వెయ్యాలని సూచించారు. అసిస్టెంట్ డైరెక్టర్ Dr. సజ్జ శ్రీనివాస్ మాట్లాడుతూ పశువులు అన్నింటికి సకాలంలో టీకాలు వేసుకోవాలని తద్వారా జబ్బులు నుండి కాపాడుకోవాలని చెప్పారు మరియు కోళ్లుకి కొక్కెర తెగుళ్లు టీకాలు వేయించుకోవాలని సూచించారు.
 ఈ కార్యక్రమంలో వెల్లంకి సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణ , ఉపసర్పంచ్ కంచరాపు శ్రీనివాసరావు  , పిన్నింటి వెంకటరమణ గొలగాని బాలు మరియు కోటమి నాయకులు హాజరయ్యారు.
   ఈ కార్యక్రమంలో 26పశువులుని తనిఖీ చేశారు, మరియు 46 లేగ దూడలకి నట్టల నివారణ మందులు తాగించారు. లేబొరెటరి వారు కూడా హాజరై పేడ పరీక్షలు మరియు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. పి. అనిల్ కుమార్, పశువైద్య సిబ్బంది పంచాయతీలో ఉన్న ప్రజలు  పాల్గొన్నారు.