ఆనందపురం ఎంపీడీవో కి వినతి పత్రం అందించిన జనసైనికులు
ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, జనవరి 29.
ఆనందపురం మండలం ఎల్వి పాలెం గ్రామపంచాయతీలో కొందరు నాయకులుపార్టీలు మారుతున్నప్పటికీ అభివృద్ధి జరగలేదని ఎల్వి పాలెం జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ లో ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో గత ప్రభుత్వంలోపనులు జరగకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిస్థాయిలో పంచాయతీని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా
ఆనందపురం మండలం ఎంపీడీవో డాక్టర్ వి. జానకి కి బుధవారం లోడగలవానిపాలెం జనసేన నాయకులు వినతిపత్రం సమర్పించారు. అందులో భాగంగా గత ప్రభుత్వంలో నిర్మించిన వైయస్సార్ రైతు భరోసా కేంద్రం అభివృద్ధి జరగకనిరుపయోగంగా ఉన్నందున సమస్యను పరిష్కారం చేయాలని అలాగే హెల్త్ క్లినిక్ సెంటర్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తో నిర్మించిన మంచినీరు ట్యాంక్ నిర్మాణం సగంలో ఆగిపోయినందున పూర్తిస్థాయిలో పని పూర్తి చేయాలని, నేలతేర్ గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి రోడ్లు డ్రైనేజీ లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు దృష్ట్యా ఎంపీడీవోకు తెలియజేశారు అలాగే గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీ, రజకులకు ప్రత్యేక కాలు స్థలాన్ని నిర్మించుట అయిన సరే కాలనీలో బట్టలు ఉతకటం అక్కడ ఉన్న ప్రజలు దుర్వాసనతో దోమలతో ప్రజలు అనారోగ్యంకి గురవుతున్నారు పంచాయతీ అధికారికి తెలియజేసిన పట్టించుకోవటం లేదని జనసైనికులు ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు పంచాయతీలో పనులు వెంటనే పూర్తి చేయాలని ఎస్సి కాలనీ మరియు చాకలి కాలనీ నేటి సమస్య పెండింగ్లో ఉంది సత్వరమే పనిచేసే ఇంటింటికి మంచినీళ్ల కొళాయిలు మంజూరు చేయాలని పాఠశాల లోపనులు ఆపేసిన వెంటనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా పంచాయతీలో పలు సమస్యలను జనసేన నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లోడగలవానిపాలెం జనసేన నాయకులు కొయ్య నాని, లోడగల సురేష్, ఆల్తిరాజు, గోల గాని సాయి, వెంకటేష్ ,తోటరాజు, బాల తదితర నాయకులు పాల్గొన్నారు.