జీపిల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ విజేత గా నిలిచిన స్కై వారియర్స్ టీమ్
భీమునిపట్నం వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ జనవరి 29;ఆనందపురం మండలం గొట్టిపల్లి పంచాయతీ
శ్రీ సీతారాముల తీర్థ మహాత్సవ సందర్భంగా ఆనందపురం మండలం గొట్టిపల్లి పంచాయతీ లో జీపియల్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ 2 ను ఘనంగా నిర్వహించడం జరిగింది.క్రీడా స్పూర్తి తో ఆడటం వలన ఈ విజయం మా సొంతం అయిందని టీమ్ సభ్యులు పట్ల సంతోషం వ్యక్తం చేసిన కెప్టెన్ బుత్తల రాజేష్
ఈ ప్రీమియర్ లీగ్ లో 4 క్రికేట్ టీమ్ లు పోల్గొనగా లీగ్ దశ నుంచి స్కై వారియర్స్ , యంగ్ పైటర్స్ ఫైనల్ కి చేరుకొని తలపడగా తొలి బ్యాటింగ్ చేసిన స్కై వారియర్స్ 4 వికేట్లు నష్టపోయి 101 పరుగులు చేసి యంగ్ పైటర్స్ ముందు ఉంచగా 10 ఓవర్లు కు 70/5 చేయడంతో పైనల్లో స్కై వారియర్స్ విజయం సాధించడం జరిగింది.
విజేత టీమ్ కు 10,000 రూపాయలు అలాగే రన్నర్ టీమ్ కు 5,000 రూపాయలు బహుమతిగా అందివ్వడం జరిగింది. ఈ విజయం పై బుత్తల రవి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ గెలవాలనే ఆడుతారని,మైదానంలో తనదైన రోజు ఎవరైతే బాగా ఆడుతారో గెలుపు వారి సొంతం అవుతుంది అని,ఈరోజు మేము సాదించిన ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని,టీమ్ సభ్యులు అంతా ఎలాగైనా గెలవాలని సమిష్టిగా ఆడి గెలుపును సాధించడం జరిగింది అని,మండలంలో ఎక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరిగినా స్కై వారియర్స్ టీమ్ మంచి క్రమశిక్షణ తో టీమ్ స్పూర్తి ని చూపుతారనే నానుడి ఉండటం మాకు మంచి వాతావరణం తో కూడిన ఆటను ప్రదర్శించాలనే ఆలోచనతో గెలుపుకు మేమంతా సిద్దం గా ఉంటామని,ఈ గెలుపు లో కారకులైన టీమ్ సభ్యులు కు ధన్యవాదాలు తెలిపారు