Sidebar


Welcome to Vizag Express
బ‌డ్జెట్ స‌మావేశాల‌కు జ‌గ‌న్‌...?

29-01-2025 21:52:12

బ‌డ్జెట్ స‌మావేశాల‌కు జ‌గ‌న్‌...?

- కూట‌మి స‌ర్కారు వైఫ‌ల్యాల‌పై బాణాలు
- ఆ త‌రువాతే జిల్ల‌ల‌లోకి...
-  ఫిబ్ర‌వ‌రి 4న వైసీపీ నేత‌ల‌తో స‌మావేశం
- ఆస‌క్తిక‌రంగా రాజ‌కీయ 

విశాఖ‌ప‌ట్నం, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌; ఫిబ్రవరి మూడో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాను న్న నేప‌ధ్యంలో వ‌చ్చే నెల 4న పార్టీ నేత‌ల‌తో జ‌ర‌గ‌నున్న భేటీలో  మాజీ సీఎం జ‌గ‌న్  కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు.  అసెంబ్లీ సమావేశాలకు హాజరు పైనా పార్టీ నేతల చ‌ర్చించి నిర్ణయించనున్నారు. బడ్జెట్ సమావేశాలు కావటంతో అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోం ది. దీంతో, బడ్జెట్ సమావేశాలకు హాజరైతే.. ఆ తరువాతనే జిల్లాల పర్యటనలు ప్రారంభం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని నిలదీయాలని.. ఇక, పూర్తిగా ప్రభుత్వం పైన గురి పెడుతూ.. కేడర్ కు భరోసా కల్పించేలా తన కార్యాచరణ ప్రకటించేందుకు జగన్ సిద్దమయ్యారు. దీంతో ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. 

ఒక్కొక్క‌రు వీడుతున్న స‌మ‌యంలో... 

ఎన్నికల్లో ఓడిన తరువాత వైసీపీని ముఖ్య నేతలు వీడారు. తాజాగా సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై నిర్ణయం సంచలనంగా మారింది. కూటమి పార్టీ లు జగన్ లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తూ అష్ట దిగ్బంధ‌నం చేస్తున్నాయి. ఇదే సమయంలో కూటమి పైన దూకుడుగానే వ్యవహరించాలని నిర్ణయించారు. సాయిరెడ్డి రాజీనామా వెనుక చోటుచేసుకున్న పరిణామాలతో మరింత అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. దీంతో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలకు ఈ మేర దిశా నిర్దేశం చేసేందుకు నిర్ణయించారు. జగన్ తాజా నిర్ణయం జగన్ రూటు మార్చారు. కూటమి ప్రభుత్వం తన పార్టీ లక్ష్యంగా.. తన పైన గురి పెట్టి చేస్తున్న రాజకీయంతో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు, రైతు అంశాల పైన పోరుబాట నిర్వహించిన వైసీపీ ఫిబ్రవరి 3న ఫీజుల పైన నిరసనలకు సిద్దమైంది. ఇక, ప్రస్తుతం లండన్ లో ఉన్న జగన్ ఫిబ్రవరి 3న అమరావతికి రానున్నారు. ఆ వెంటనే 4వ తేదీన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. సాయిరెడ్డి నిర్ణయం తో పార్టీలో ఏర్పడిన డైలమాను తెలిగించి.. భరోసా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అదే సమయంలో భవిష్యత్ కార్యాచరణ పైన స్పష్టత ఇవ్వనున్నారు. పార్టీ నేతలతో సమావేశం ముఖ్య నేతల భేటీలో సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవటం వెనుక చోటు చేసుకున్న అంశా లపైన క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తనతో సాయిరెడ్డి ప్రస్తావించిన కారణాలను.. తాను ఏం చెప్పిందీ పార్టీ నేతలకు వివరించాలని జగన్ భావిస్తున్న‌ట్టు  సమాచారం.  స‌మావేశంలో మాట్లాడితేచాల‌దు... మీడియా సమావేశంలోనే ఓపెన్ గా స్టీల్ ప్లాంట్ అంశం, రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, తన హయాం లో జరిగిన ఆర్దిక నిర్వహణ పైన వస్తున్న విమర్శలకు సమాధానం చెబుతూనే.. సాయిరెడ్డి పార్టీ వీడటం పైన స్పందించాలని భావిస్తున్నారు