Sidebar


Welcome to Vizag Express
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలుగా పేడాడ రమణికుమారి

29-01-2025 22:00:04

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలుగా పేడాడ రమణికుమారి
విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్; వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలుగా వైఎస్ ఆర్ సిపి సీనియర్ మహిళా నాయకురాలు శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు పేడాడ రమణి కుమారి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వై.యస్.జగన్ మోహన్ రెడ్డికి,విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు,మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు,శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వరుదు కళ్యాణి కి,ఇతర ప్రజా ప్రతినిధులుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.