జాతీయస్థాయి అంధుల క్రికెట్ పోటీలకు ఆంధ్రా జట్టు
*ఫిబ్రవరి 2 నుంచి 7వ తేదీ వరకు బెంగుళూరులో టోర్నమెంట్
విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్;
బెంగుళూరులో ఫిబ్రవరి 2 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి అంధుల క్రికెట్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రా జట్టు బుధవారం ముమ్మరంగా ప్రాక్టీ చేసింది. ఆంధ్ర క్రికెట్ అసో సియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు, ఇతర అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సహకారంతో బుధవారం నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లేపల్లి మైదానంలో ప్రాక్టీసు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల క్రికెట్ కమిటీ కమిటీ చైర్మన్ యడ్లపల్లి సూర్యనారాయణ, సభ్యులు సురవరపు రామన్ సుబ్బారావు, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.