Sidebar


Welcome to Vizag Express
చలి ఉత్సవానికి చురుగ్గా జరుగుతున్న ఏర్పాట్లు

29-01-2025 22:07:07

చలి ఉత్సవానికి చురుగ్గా జరుగుతున్న ఏర్పాట్లు

అరకు వ్యాలీ/పాడేరు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 29; చలి ఉత్సవం పర్యాటకులకు కను విందు చేయబోతోంది. ఆంధ్రా ఊటీ అరకులోయ కేంద్రంలో చలి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చలి అరుకు ఉత్సవం 25 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా జరుతున్నాయి. ఈనెల 31, వచ్చేనెల 1,2 తేదీల లో అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చలి అరకు ఉత్సవానికి అధికార యంత్రాం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అరకు వ్యాలీ అందాలు, గిరిజన ఆచార సాంప్రదాయాలను ప్రతిబింభించే విధంగా ఉత్సవం ఏర్పాటు చేస్తున్నారు. ప్యారా గ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్ మూడు రోజుల పాటు, రంగ వల్లులు ధింసా నృత్యం, వివిద గిరిజన నృత్యాలు ఏర్పాటు చేస్తున్నారు. పద్మాపురం గార్డెన్లో పూల ప్రదర్శన చేయడం జరుగుతుంది. వివిద రాష్ట్రాల నుండి గిరిజన కళాకారులు అరుకు ఉత్సవంలో పాల్గొంటారు. దేశ నలు మూలల నుండి గిరిజన కళాకారులు వస్తున్నారు.గిరిజన ఉత్పత్తులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన ఫుడ్ కోర్టు, బస్తర్ బ్యాండ్ ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన ధింసా నృత్యం, గిరిజన ఫ్యాషన్ షో నిర్వహిస్తారు. పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు.అదేవిధంగా హెలీకాప్టర్లో విహరించడానికి ఏర్పాటు చేసారు. సందర్శకులకు ఎటువంటి అసౌకర్య కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బొర్రా జంక్షన్ నుండి డిగ్రీ కళాశాల మైదానం వరకు సైక్లింగ్ నిర్వహిస్తున్నారు. అరకు వ్యాలీ పట్టణంలో ఐదు కిలో మీటర్ల మారథాన్ రన్ నిర్వహిస్తారు. పర్యాటకులకు మూడు రోజులు పాటు మరపురాని తీపి జ్ఞాపకాన్ని మిగిల్చే విధంగా చలి అరకు ఉత్పావాన్ని నిర్వహిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజుల పాటు వివిద కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదవకాశాన్ని అందరూ సద్వనియోగం చేసుకోవాలని కోరుతున్నారు.