Sidebar


Welcome to Vizag Express
నిఘనేత్రాల సహాయంతో ప్రశాంతంగా ముగిసిన శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం....జిల్లా ఎస్పీ

29-01-2025 22:11:44

నిఘనేత్రాల సహాయంతో ప్రశాంతంగా ముగిసిన శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం....జిల్లా ఎస్పీ  

పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 28:

శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతర రెండవ రోజు క్యులైన్ల వద్ద, సిరిమానోత్సవం వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గుడి లోపల, క్యులైన్ల వద్ద,ముఖ్యకూడల్లవద్ద,సిరిమాను తిరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన  సిసి కెమెరాల ఫుటేజులును, అదేవిధంగా సిరిమాను కార్యక్రమాన్ని అంతటిని, సిరిమాను తిరిగే ప్రదేశాలలో డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి పరిసర ప్రాంతాలలో తీసిన ఫుటేజులును తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయడంతో అన్ని ఫుటేజులను కమాండ్ కంట్రోల్ నుండి జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ పర్యవేక్షించారు.
 గుడి లోపల, క్యులైన్ల వద్ద, సిరిమాను తిరిగే ప్రదేశాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరియు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా  కమాండ్ కంట్రోల్ నుండి పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అప్రమత్తం చేయడం జరిగింది. నిఘనేత్రాలను ఉపయోగించడం వలన ఎటువంటి అవాంచనీయ సంఘటనలు,  దొంగతనాలు జరగకుండా సిరిమానోత్సవం సక్రమంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్  తెలియజేసారు.