వైసీపీ పార్టీ వాళ్లను టిడిపిలోనికి ఆహ్వానించిన వారిని తిరస్కరించిన ఎమ్మెల్యే
కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29:
కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలును టిడిపిలోనికి ఆహ్వానించడాన్ని ఎమ్మెల్యే తిరస్కరించారు. కొమరాడ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు కొమరాడ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలును ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించడాన్ని కొమరాడకు చెందిన తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్చార్జిలు , బూత్ కన్వీనర్లు, కొందరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వ్యతిరేకించారు. ఆమె మాట్లాడుతూ కొమరాడ గ్రామంలో ఉన్న సీనియర్, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై వచ్చి, నిర్ణయం తీసుకున్నాకే మండల అధ్యక్షుని సమక్షంలో పార్టీలోకి ఎవరినైనా ఆహ్వానించడం జరుగుతుందని ఆమె కరాకండిగా చెప్పారు. నిజమైన తెలుగుదేశం నాయకులను ,కార్యకర్తలను పార్టీ అధిష్టానము ఎల్లవేళలా గుర్తుంచుకుని వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని ఆమె అన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి గ్రామాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు సహకారంతోనే పార్టీని ముందుకు నడిపిస్తామని ఆమె అన్నారు.