Sidebar


Welcome to Vizag Express
200 మందికి వైద్య పరీక్షలు

29-01-2025 22:19:54

200 మందికి వైద్య పరీక్షలు


సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 29:


 సోంపేట అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో  ,బంజు మణికంఠ జన్మదినం సందర్భంగా జెమ్స్ ఆసుపత్రి వైద్య సిబ్బంది సౌజన్యముతో బుధవారం సోంపేట లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 28  యూనిట్లు రక్తాన్ని సేకరించారు. ఇందులో 15 మంది రోగులకు జెమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు .ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు వైద్యం అందించాలన్న లక్ష్యంతో శిబిరం ఏర్పాటు చేశామన్నారు.ఈ శిబిరంలో ఊహించని దానికన్నా ఎక్కువ మంది పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సోంపేట పట్టణానికి చెందిన మాజీ ఎంపీపీ  చిత్రాడ శ్రీనువాస్ , చిత్రాల శేఖర్, రెల్ల నారాయణ  ,రాఘవ దాస్ తదితరులు పాల్గొన్నారు.అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు.