Sidebar


Welcome to Vizag Express
ఎల్ ఎన్ పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని జిల్లాలో 458 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది

29-01-2025 22:23:48

ఎల్ ఎన్ పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని జిల్లాలో 458 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది

ఎల్ఎన్ పేట, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29: 

లక్ష్మీ నర్సు పేట మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీలో జిల్లా స్థాయిలో  458 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిన నందిగాన తేజవతి. వ్యవసాయ ఆధారిత కుటుంబ నేపథ్యం కలిగిన తేజవతి చిన్నప్పటి నుంచి విద్యలో చురుకుగా ఉంటూ మంచి మార్కులు తెచ్చుకుంటూ వస్తుంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ చేతుల మీదుగా నగదు బహుమతి, ఫీల్డ్ ప్రధానం చేయడం జరిగింది. ప్రభుత్వ కళాశాలలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని అభినందించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ తవిటి నాయుడు, కళాశాల ప్రిన్సిపల్ బి శ్యాం సుందర్, ఏ రామారావు, ఎల్ ఎన్ పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం విద్యార్థినికి అభినందించారు. ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ కష్టపడి బాగా చదివి ఇంజనీరింగ్ లో సీట్ సంపాదించి ఇంజనీరుగా స్థిరపడాలని లక్ష్యం పెట్టుకున్నానని తేజవతి చెప్పారు.