Sidebar


Welcome to Vizag Express
95లీటర్ల నాటుసారాతో వ్యక్తి అరెస్ట్

29-01-2025 22:28:49

95లీటర్ల నాటుసారాతో వ్యక్తి అరెస్ట్ 

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 29:


మందస మండలం బుడారిసింగి పంచాయతీ గుడ్డికోల గ్రామం పరిధిలో ప్రొహిబిషన్, ఎక్సైజ్   జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీం బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సోంపేట సీఐ కె. బేబి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 1900 లీటర్ల నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. 95 లీటర్ల నాటుసారాతో ఒకరిని పట్టుకుని, రిమాండ్ కు తరలించడం జరిగిందని సీఐ బేబి తెలిపారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ డీవీజీ రాజు, సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ కె.సుజాత, సిబ్బంది పాల్గొన్నారు.