Sidebar


Welcome to Vizag Express
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష కేంద్రాలు మంజూరు చేయాలి

29-01-2025 22:32:58

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష కేంద్రాలు మంజూరు చేయాలి 

ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29

 ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష కేంద్రాలు మంజూరు చేయాలని టిడిపి సీనియర్ నాయకులు, బీసీ సాధికార సమితి కన్వీనర్ కొండా శంకర్ రెడ్డి ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను కోరారు. ఈ మేరకు బుధవారం రామయ్య పుట్టుగా పార్టీ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో ఏడు సంవత్సరాల పాటు ఇచ్చాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్, ఇంటర్ సెంటర్ ఉండేది. తర్వాత సుమారుగా నాలుగు సంవత్సరాల కిందట ఎత్తివేశారు. దీంతో ఓపెన్ టెన్త్, ఇంటర్ చదువుకునేందుకు వీలు లేకపోవడంతో చాలామంది చదువులు ఆపేశారు. గతంలో ఇచ్చాపురం సెంటర్ ద్వారా నాలుగు మండలాల విద్యార్థులతో పాటు పక్కనే ఉన్న ఒరిస్సా నుండి కూడా విద్యార్థులు వచ్చి పరీక్షలు రాసుకునేవారు. ఈ సెంటర్ ను  మరల ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని కొండా శంకర్ రెడ్డి తెలిపారు.