Sidebar


Welcome to Vizag Express
హైవే రోడ్డు విస్తరణకు పనులు కు వ్యతిరేకంగా నేడు రణస్థలం బందుకు పిలుపు

29-01-2025 22:34:16

హైవే రోడ్డు విస్తరణకు పనులు కు వ్యతిరేకంగా నేడు రణస్థలం బందుకు పిలుపు 

 రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29

 రణస్థలం మండల కేంద్రం లో నేడు వ్యాపారులు  బంద్ కు పిలిపునిచ్చారు. హైవే రోడ్డు విస్తరణ పనులు నిమిత్తం అధికారులు, విస్తరణ స్థలంలుకు మార్కింగ్ ప్రారంభం చేశారు. దీనిపై కనీసం రెవెన్యూ అధికారులు,ఎన్ హెచ్ ఎ ఐ అధికారులు స్థానిక వ్యాపారులుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పనులు ప్రారంభం చేయడం పట్ల వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో   వ్యాపారస్తులు నిరసన  వ్యక్తం చేస్తూ హైవే అధికారులు కు వ్యతిరేకంగా నేడు బంద్ చేయాలనీ నిర్ణయం చేశారు. మండల కేంద్రం లో కూటం ఎమ్మెల్యే, ఎంపీ లు ఉన్నా అధికారులు తీరును చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు తగినవిదంగా చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానిక వ్యాపారాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రణస్థలం పట్టణం లో హైవే రోడ్డు విస్తరణ చేపట్టి మా పొట్టలు కొట్టొద్దుని అధికారులు కు, ప్రజా ప్రతినిధులు కు ఎన్ని సార్లు మోరపెట్టుకున్న విస్తరణ పనులు నిలపలేదని ఆఖరికి కనీసం ముందుస్తూ సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది గురిచేయ్యటం భావ్యం కాదని ఆవేదన చెందుతున్నారు