Sidebar


Welcome to Vizag Express
గిరిజనులకు తప్పని డోలిమోతలు నిండు గర్భిణీకు రహదారి కష్టాలు రహదారి నిర్మించాలని స్థానికులు ఆందోళన

30-01-2025 18:46:08

గిరిజనులకు తప్పని డోలిమోతలు

నిండు గర్భిణీకు రహదారి కష్టాలు 

రహదారి నిర్మించాలని స్థానికులు ఆందోళన

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి,30:
రహదారి సౌకర్యం లేక నిండు గర్భిని తీవ్ర అవస్థలు. 
కుటుంబీకుల సహాయంతో కిలోమీటర్ డోలిమొతతో ఆసుపత్రి తరలింపు.
78 ఏళ్ల స్వాతంత్ర భారత దేశంలో అభివృద్ధికి నోచుకోని గిరిజన గ్రామాలు అనేకముగా ఉన్నాయని సరైన రహాదారి సౌకర్యం లేక డోలిమోతలు తప్పడం లేదు. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారిన ఎంతోమంది ప్రజాప్రతినిధులు పరిపాలించిన ఆదివాసి గిరిజనుల బతుకులు మారటం లేదు.అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ చెరువు వీధి గ్రామానికి చెందిన కిలో వనిత నిండు గర్భిణీ గురువారం ఉదయం  సమయంలో పురిటి నొప్పులు రావడంతో గ్రామంలో 108 వాహనం వచ్చేందుకు వీలు లేక కుటుంబీకులు డోలిమోత మోసి సుమారు1కిలోమీటర్ దూరంలో ఉన్న బొడ్డాగొంది గ్రామంలో తరలించవలసిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో 30 సంవత్సరాల క్రితం మూడు కిలోమీటర్లు రహదారి నిర్మాణం చేసినప్పటికీ గ్రామంలో భూతగాధాల తో రాకపోకలు లేకపోయేసరికి రహదారి పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరి గుంతలు గుంతలుగా ఏర్పడింది. దీంతో గ్రామంలో ఎవరినైనా అనారోగ్యాన బారిన పడిన నిండు గర్భిణులకు పురిటి వచ్చిన సరైన సమయంలో  వారిని ఆసుపత్రి తరలించి చికిత్స అందించేందుకు రహదారి సౌకర్యం లేక ఐదు సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో రోడ్డు నిర్మాణం , భూతగాదాల సమస్యలు పరిష్కారం చేసేందుకు అనేకసార్లు సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికీ అధికారులు గ్రామానికి సందర్శిస్తున్నారే తప్ప సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం లేదు. సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చూపటంతో గ్రామస్తులకు రహదారి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో రోడ్డు నిర్మాణం భూ తగాదాల సమస్యలను అల్లూరి జిల్లా కలెక్టర్ స్పందించి రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పిసా కమిటీ కార్యదర్శి, వంతాల రఘునాథ్, స్థానికులు, కె మోహన్ రావు, వి రఘునాథ్, ఎస్ నాగేశ్వరరావు, జీనబంధు, పలసి ఈశ్వరరావు, సబడ ప్రసాద్, ఎం భాస్కరరావు వి కుమారి, పోర్తిమ లతో పాటు కుటుంబీకులు, తదితరులు ఉన్నారు.