గిరిజనుల చట్టాలను హక్కులను కాల రాస్తే ఊరుకోం
శాసనసభ స్పీకర్ చట్టాలపై మాట్లాడిన తీరు సరికాదు
ఆదివాసి గిరిజన సంఘం
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి,30:
ఆదివాసి గిరిజన ప్రాంతంలో టూరిజం ఏర్పాటు వల్ల లబ్ధి ఎవరికి ప్రభుత్వ స్పష్టత ఇవ్వాలి
మండల కేంద్రంలో గల ఆదివాసి గిరిజన సంఘం కార్యాలయంలో ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎం ఎం శ్రీను అత్యవసర సమావేశాన్ని గురువారం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సోమవారం విశాఖ నోవోటాల్లో నిర్వహించిన ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సుకు,శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. 1/ 70 చట్టం ఆదివాసి గిరిజనులకు గుండె కాయ వంటిది వాటిని కాలరాస్తూ ప్రసంగించడం దుర్మార్గం ఇంకా భావిస్తున్నామన్నారు.
ఆదివాసి గిరిజన ప్రాంతంలో సంపాదనను కాపాడవలసిన ప్రభుత్వమే కార్పోరేట్లకు , బడా బాబులకు, జమ్ము కాస్తూ గిరిజన ప్రాంతంలో పటిష్టంగా అమలయ్యే 1/ 70 చట్టం తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహిస్తున్నారు. 1/70 చట్టాన్ని చుట్టారిగం చేసుకొని గిరిజనుల మనుగడను తుంగలో తొక్కే ప్రయత్నం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుంది. చట్టం జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. పర్యాటక అభివృద్ధి పేరుతో 1/ 70 చట్టం సవరణకు తీసుకొస్తే ఆదివాసి గిరిజనులు ఏకమై రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు , ప్రభుత్వ కార్యాలయాల ముట్టాడీలకు వెనకాడబోమని ,ప్రాణాలు తెగించైనా 1/70 చట్టం కాపాడు కుంటామనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శాసనసభ సభాపతి 1/70 చట్టంపై మాట్లాడిన వ్యాఖ్యాలను వెనక్కి తీసుకోవాలి. ఆదివాసి గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం వెన్నుముక లాంటిది. దాన్ని కాలా రాస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఆదివాసి సంఘాల నేతలు తీవ్ర ఖండిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బడా బాబులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేటర్లకు, బినామీలకు ప్రోత్సహిస్తూ ఆదివాసి గిరిజన ప్రాంతంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పేరిట నీరుగారుస్తూ వ్యవహరిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తక్షణమే మాట్లాడిన వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకొని ఆదివాసి గిరిజనులకు క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఆదివాసి గిరిజన ప్రాంతంలో పైసా చట్టంతో పాటు ఒకటి బై 70 చట్టం పట్టిష్టంగా అమలు చేసి ఆదివాసులకు నూటికి నూరు శాతం అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటు ఆయుధంతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
టూరిజం పెట్టుబడిదారులకు ప్రోత్సహించడం చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభమేంటి? ఆదివాసి గిరిజన ప్రాంతంలో స్వచ్ఛమైన వాతావరణంతో కూడిన కనువిందుగా కనబరిచే ప్రకృతి అందాలను అభివృద్ధి ప్రజలకు మభ్యపెడుతూన్నారు,పర్యాటక కేంద్రాలు అభివృద్ధి పేరిట ప్రభుత్వం పెట్టుబడిదారీ వ్యవస్థ తీసుకురావటం,బడా బాబులకు కట్టబెట్టడం, బినామీలకు అవకాశాలు ఇవ్వడం వల్ల ఆదివాసి గిరిజన ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు నూటికి నూరు శాతం కోల్పోతారని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం మండల కమిటీ సభ్యుడు ఎస్ గాసిరం దొర, గొల్లెల నారాయణ పాల్గొన్నారు.