మౌలిక వసతులు కల్పించాలి
మండల పార్టీ అధ్యక్షులు
పాంగి పద్మారావు
30-01-2025 18:49:23
మౌలిక వసతులు కల్పించాలి
మండల పార్టీ అధ్యక్షులు
పాంగి పద్మారావు
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి,30: మండలంలో పంచాయతీ పరిధి గ్రామాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గురువారం అరకు నియోజకవర్గం కేంద్రంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కు మండల పార్టీ అధ్యక్షులు పాంగి పద్మారావు పార్టీ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండలంలో 23 పంచాయితీ పరిధి గ్రామాలలో మౌలిక వసతులు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. మారుమూల గ్రామాలలో ఇంటర్నల్ రోడ్లు, రోడ్డు లేని గ్రామాలకు గ్రావెల్ రోడ్డు, బీటి రోడ్లు, నిర్మాణాలు చేపట్టి మండల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని వినతి పత్రం అందించమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సందడి కొండబాబు, మాజీ ఎంపీటీసీ, చంద్రబాబు, వైసిపి యువ నేతలు, ఎం రాంప్రసాద్, బాలరాజు లతోపాటు బి దామోదరం తదితరులు పాల్గొన్నారు.