Sidebar


Welcome to Vizag Express
ఉద్యాన పంటలతో అధిక ఆదాయం

30-01-2025 18:50:46

ఉద్యాన పంటలతో అధిక ఆదాయం  : జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రభాకర్ రావు.                                                                   
కె. కోటపాడు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30 : రైతులు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపించి అధిక ఆదాయాన్ని పొందాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రభాకర్ రావు అన్నారు. గురువారం ఈ మండలం కే సంత పాలెం లో రైతులు పండిస్తున్న వివిధ రకాల కూరగాయల పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూరగాయలు పండించిన రైతులకు ప్రభుత్వం అనేక రాయితీలు అందిస్తుందన్నారు. కే కోటపాడు మండలంలోని కె సంతపాలెం , ఆర్లే , సూదివలస , కింతాడ చోడవరం మండలంలో అడ్డూరు , సబ్బవరం మండలంలోని వంగలి , అమృతపురం గ్రామాలను వెజిటబుల్ క్లస్టర్ గా గుర్తించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల నుండి విశాఖ నగరానికి అత్యధికంగా కూరగాయలు రవాణా జరుగుతున్నాయని అన్నారు. తెగుళ్లు  సోకని మేలైన కూరగాయ విత్తనాలను రైతులకు సరఫరా చేయడం జరుగుతుందని ,  మల్చింగ్  , డ్రిప్పు పద్ధతిలో సాగు చేసి రైతులు ఖర్చు తగ్గించుకోవాలని అన్నారు. పందిరి జాతి కూరగాయల పెంపకానికి ప్రభుత్వ సబ్సిడీ ఉంటుందని అన్నారు. ఒక్కో సమయంలో కూరగాయలకు సరైన మద్దతు ధర లేనప్పుడు వాటి ద్వారా పచ్చళ్ళు , పొడులు తయారీకి మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మార్కెటింగ్ శాఖ ద్వారా వాటికి మార్కెట్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన కూరగాయలకు మంచి ధర ఉంటుందని ఆ దిశగా రైతులు దృష్టి సారించాలన్నారు. అంతకుముందు ఉద్యాన సహాయకుల సమావేశంలో మాట్లాడుతూ కూరగాయల రైతులకు ఆన్ లైన్  గుర్తింపు నెంబర్ పై అవగాహన కల్పించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం ఆ