వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతిపితకు ఘన నివాళులు
30-01-2025 18:53:11
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతిపితకు ఘన నివాళులు: నర్సీపట్నం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30:
సత్యం అహింస మార్గాల తో ప్రపంచానికి మార్గదర్శకుడైన మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని, నర్సీపట్నం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గురువారం గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు నర్సీపట్నం శ్రీ వాసవి కళ్యాణ మండపం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సత్యాగ్రహమే ఆయుధంగా, అహింసా మార్గంలో పోరాడి, భారతదేశానికి స్వాతంత్ర్యం అందించిన జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు, భారతజాతి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక వాసవి క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు, నాళం రమేష్ కుమార్,కేదారి శెట్టి బంగారు శెట్టి,తాటికొండ హేమంత్, పల్లపోతు గణేష్ ఆర్థిక సాయంతో, నర్సీపట్నంలో నిరంతరం స్వచ్ఛభారత్ నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.