Sidebar


Welcome to Vizag Express
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు నాగరాజుకు శుభాకాంక్షలు

30-01-2025 18:54:36

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు నాగరాజుకు శుభాకాంక్షలు: నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30: 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబిసి చైర్మన్ సొంటి నాగరాజును, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ  నియమించింది. ఈ సందర్భంగా నాగరాజును నియమించడం పట్ల, కాంగ్రెస్ పార్టీ,అనకాపల్లి జిల్లా ఓబిసి చైర్మన్, బొంతు రమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. కష్టేఫలి అన్న చందంగా,కృషి పట్టుదలతో నాగరాజు పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ, గ్రామస్థాయి నుంచి నేడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగడం గర్వించదగిన విషయం అన్నారు. అంచెలంచెలుగా ఎదిగిన నాగరాజు రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులను చేపట్టారని తెలిపారు. పెడన నియోజకవర్గం ఇన్చార్జిగా ఉంటూ,కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు గుర్తించి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓ బి సి రాష్ట్ర చైర్మన్ గా నియమించిందన్నారు. అలాగే తాజాగా నాగరాజును ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జిగా నియమిస్తూ, పార్టీ అధిష్టానం గురుతర బాధ్యతను అప్పగించడం విశేషమన్నారు. నాగరాజు భవిష్యత్ రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రమణ ఆకాంక్షించారు.