ఎమ్మెల్యేను కలిసిన తూర్పు కాపు సంఘ సభ్యులు
యాలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30:
నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ను అచ్యుతాపురంలో గల ఆయన కార్యాలయంలో గురువారం నాడు ఉమ్మడి విశాఖ జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘ అధ్యక్షులు ఏ వి రమణయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ నాలుగు మండలాలలో గల కాపు సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి,శాలువాతో సత్కరించారు. వారు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో కోశాధికారి కొటారు శ్రీను, రాంబిల్లి మండలం తూర్పు కాపు సంఘం అధ్యక్షులు ముత్తా వెంకటరమణ,యలమంచిలి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొటారు సాంబ,సంఘం కార్యకర్త నారాయణరావు,తూర్పు సంఘం కార్యదర్శిబావిశెట్టి గణేష్,నర్సీపట్నం గ్రామం తూర్పుసంఘం విప్పల ప్రసాద్, కొయ్యూరు సమితి మాజీ అధ్యక్షులు బండారు నూకరాజు తదితరులు ఉన్నారు.