Sidebar


Welcome to Vizag Express
ఏటికొప్పాక కళాకారుడు సంతోష్ ను సత్కరించిన ఎమ్మెల్యే

30-01-2025 18:58:28

ఏటికొప్పాక కళాకారుడు సంతోష్ ను సత్కరించిన ఎమ్మెల్యే
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి30:
దేశ రాజ‌ధాని ఢిల్లీలోని క‌ర్త‌వ్య‌ప‌ద్‌లో జ‌రిగిన 76వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ పెరేడ్‌లో భాగంగా ప్ర‌ద‌ర్శించిన శ‌క‌టాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ శ‌క‌టానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారంతో పాటుగా మూడవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆ శకటానిని తయారు చేసిన యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన సంతోష్ ను గురువారం నాడు యలమంచిలి జనసేన పార్టీ కార్యాలయంలో సుందరపు విజయ్ కుమార్ సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 30సంవత్సరాల తర్వాత  రాష్ట్ర శ‌క‌టానికి కేంద్ర ప్ర‌భుత్వ పుర‌స్కారం రావడం గర్వ కారణమని, అంతటి పేరు ప్రఖ్యాత తెచ్చిన ఏటికొప్పాక గ్రామ కళాకారుడు ఆయన నియోజకవర్గం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హస్త కళాకారుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.ఏటికొప్పాక లక్క బొమ్మలు మరింతగా ప్రాచుర్యం పొందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు బొద్దపు శ్రీనివాసరావు,కూటమి పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నా