మహాత్ముని బాట స్ఫూర్తిదాయకం
ఎస్టీ కమీషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు
విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్,జనవరి 30
అహింసా మార్గంతో దేశ స్వాతంత్ర్య సాధనలో మహాత్మ గాంధీ పోరాటం స్ఫూర్తి దాయకమని రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు అన్నారు. మహాత్ముని వర్ధంతి సందర్భంగా
విజయనగరం లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ డివిజి శంకరరావు మాట్లాడుతూ మహాత్ముని ప్రస్తావన లేకుండా భారత దేశ చరిత్ర లేదన్నారు.చంపారన్ ఉద్యమం మొదలు కొని స్వాతంత్ర్య సాధన వరకు శాంతి మార్గంలో ఆయన చేసిన పోరాటం ఉద్యమ చరిత్ర లో నూతన అధ్యాయమని శంకరరావు పేర్కొన్నారు .ఖద్దరుకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ను తెలుసుకుని చేనేతను ప్రోత్సహించాల్సివుందన్నారు.ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడమే నిజమైన నివాళిగా పేర్కొన్నారు.