Sidebar


Welcome to Vizag Express
జగన్ చేసిన అప్పులే రాష్ట్రానికి ముప్పు

30-01-2025 19:06:21

విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్ జనవరి 30

జగన్ చేసిన అప్పులే రాష్ట్రానికి ముప్పు : ఎమ్మెల్యే అదితి గజపతి రాజు 

పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారు మాట్లాడుతూ గత అయిదేళ్ల జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసిపి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దివాళా తీయించారని విమర్శించారు.   గడచిన 7 నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రీయంబర్స్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వం చేసిన  బకాయిలు రూ. 22 వేల కోట్లను చంద్రబాబు నాయుడి గారి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం చెల్లించిందని, అప్పులు కూడా పుట్టని స్థితి ఏర్పడిందని అన్నారు. ఏడాదికి రూ. 71 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లించాలి, ఇవి రాష్ట్ర  ప్రభుత్వానికి గుదిబండలా మారాయని అన్నారు. 

అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి, చేసిన అప్పులతో జగన్ విలాసాలు, దుబారా ఖర్చులు చేశారు కానీ రాష్ట్రాభివృద్ధికి వినియోగించలేదని అన్నారు.  

ఇన్ని అప్పులు చేసినా ఇంకా అనేక వ్యవస్థలలో  బకాయిలు పెట్టారని, వాటిలో  డిగ్రీ ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు : రూ. 2,832 కోట్లు, ఫీజు రీయంబర్స్మెంట్  : రూ. 450 కోట్లు, చిక్కీలు, కోడిగుడ్లు : రూ. 256 కోట్లు, వసతి దీవెన : రూ. 989 కోట్లు, ఆరోగ్య శ్రీ బకాయిలు : రూ. 1800 కోట్లు, ధాన్యం బకాయిలు : రూ. 1600 కోట్లు, ఉద్యోగులకు బకాయిలు : రూ. 20,000 కోట్లు, ఇరిగేషన్ కాట్రాక్టర్ల బకాయిలు : రూ. 19,000 కోట్లు, గృహ నిర్మాణం బకాయిలు : రూ. 7,800 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు : రూ. 2,100 కోట్లు... ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయని అన్నారు. 

ఈ విధంగా జగన్ ప్రభుత్వం పెట్టిన బకాయి రూ. 1.40 లక్షల కోట్లు ఉన్నాయని, ఈ స్థాయిలో గతంలో  ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టలేదని అన్నారు. 

జగన్ తెచ్చిన అప్పులు ప్రభుత్వ ఆదాయం పెంచే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసా�