పాడి రైతుల కోసం ప్రవేశ పెట్టె పోటీలను పరిశీలించిన ఎమ్మెల్యే..
నెల్లిమర్ల : వైజాగ్ ఎక్స్ ప్రెస్. జనవరి 30
నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు, టిడిపి నాయకులు పానీ రాజు గారు మరియు శ్రీ ప్రకాష్ విద్య సంస్థల అధినేత గార్లతో కలిసి, పాల ఉత్పత్తి మరియు పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఐదు రోజులపాటు నిర్వహించనున్న పోటీపై చర్చించారు. ఈ పోటీ ద్వారా పాడి రైతులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడంతో పాటు, పాల ఉత్పత్తి పెంపు పద్ధతులపై అవగాహన పెరగనుంది. అదనంగా, ఈ కార్యక్రమం పాడి పరిశ్రమలో నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టడంలో మరియు రైతులకు ఆర్థికంగా మద్దతు అందించడంలో సహాయపడుతుంది. ఈ చర్చ ద్వారా, పాడి రైతుల సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు నాయకులు కృషి చేస్తున్నారు.అని తెలిపారు.