Sidebar


Welcome to Vizag Express
ఈ రోజు చీపురుపల్లి పట్టణం లో గల శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో కళాశాల కరెస్పాండంట్

30-01-2025 19:10:32

చీపురుపల్లి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్ న్యూస్, జనవరి 30: ఈ రోజు చీపురుపల్లి పట్టణం లో గల శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో  కళాశాల కరెస్పాండంట్ & ప్రిన్సిపాల్ దాసరి శివ ప్రసాద్ రావు  మరియు భారతీయ జనతా పార్టీ మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు & స్నేహబంధం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కింతాడ ప్రదీప్ కుమార్   ఆధ్వర్యంలో విద్యార్థులకు చీపురుపల్లి డీఎస్పీ తో మోటివేషన్ క్లాసు మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ రాఘవులు గారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే మంచి నడవడికను కలిగి ఉండాలి మరియు సమాజంలో లో మాదక ద్రవ్యాలు  వినియోగించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు, యువతే దేశానికి వెన్నుముక అని భారత ప్రధాని నరేంద్ర మోదీ  పేర్కొన్న విధంగా యువత భవిష్యత్తు లో ప్రధాన పాత్ర పోషించి భారత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు, శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల లో స్పోర్ట్స్ మీట్ లో స్టేట్ కి , స్కౌట్స్ అండ్ గైడ్ కి సెలెక్ట్ అయిన విద్యార్థులకు , మరియు పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు , ఈ కార్యక్రమంలో కింతాడ ప్రదీప్  ప్రతి సంవత్సరం తన వంతు గా కళాశాల విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పారితోషకాలు అందజేస్తా అని తెలిపారు, ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శివ ప్రసాద్ మాట్లాడుతూ చీపురుపల్లి మండలం లో గాయత్రి కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు అని తెలిపారు, మంచి ఫలితాలే కాకుండా మంచి నడవడికను కనపరుస్తున్నారు అని తెలిపారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు , చీపురుపల్లి సీఐ శంకర్రావు , చీపురుపల్లి  ఎస్.ఐ దామోదర్,  కళాశాల ప్రిన్సిపాల్ శివ ప్రసాద్, చీపురుపల్లి మండలం భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా  అధ్యక్షుడు ప్రదీప్ కుమార , కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.