Sidebar


Welcome to Vizag Express
గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం : జనసేన నేత గురాన అయ్యలు

30-01-2025 19:11:33

గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం
: జనసేన నేత గురాన అయ్యలు
విజయనగరంటౌన్, వైజాగ్ ఎక్సప్రెస్ జనవరి 30

మహాత్మా గాంధీ ఆశయాలు గొప్పవని, ఆధునిక సమాజానికి స్ఫూర్తిదాయకమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. మహాత్మా గాంధీ
వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన కార్యాలయంలో గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి  నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
సమ సమాజ స్థాపన కోసం మహాత్మా గాంధీ తపించారని పేర్కొన్నారు.
సత్యగ్రహమే ఆయుధంగా, అహింస, శాంతి మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడని కొనియాడారు. 
ఆయన చూపిన మార్గంలో సమాజ శ్రేయస్సుకు ప్రతీ పౌరుడు పాటుపడాలన్నారు
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పి. రవీంద్ర , నాగులపల్లి ప్రసాద్ , సిరిపురపు దేవుడు, ఎంటి రాజేష్, పి.అభిలాష్, ఎమ్.పవన్ కుమార్, పృథ్వీ భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు..