Sidebar


Welcome to Vizag Express
ప్రతి పంచాయతి లో ప్రతి రోజు ఉపాధి పనులు జరగాలి

30-01-2025 19:16:01

విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్ జనవరి 30

ప్రతి పంచాయతి లో ప్రతి రోజు ఉపాధి పనులు జరగాలి 
ఉన్నది రెండు నెలలే 
ఉపాధిహామీ ప‌నుల‌పై క‌లెక్ట‌ర్‌ సమీక్ష 
                  ప్రతి గ్రామా పంచాయతి లో ప్రతి రోజు ఉపాధి పనులు తప్పక జరగాలని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ ఆదేశించారు.   ఉపాధిహామీ మెటీరియ‌ల్ కాంపోనెంట్ ప‌నులు,  ప‌నిదినాల క‌ల్ప‌న‌పై  ఎం.పి.డి.ఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో తన ఛాంబర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం కలెక్టర్ సమీక్షించారు.  ఉన్నది రెండు నెలల గడువేనని , ఈ ఏడాది లక్ష్యాలను పూర్తి చేయక పోతే వచ్చే ఏడాదికి నిధులు రాకపోవచ్చునని, పేద ప్రజలకు నష్టం జరిగితే సహించేది లేదని స్పష్టం చేసారు.   అందుబాటులో ఉన్న నిధుల‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. . రేపటినుంచి ప్ర‌తీ గ్రామంలో ఉపాధి ప‌నులు జ‌ర‌గాల్సిందేన‌ని, ప్ర‌జ‌ల‌కు విస్తృత స్థాయిలో ప‌ని క‌ల్పించాల‌ని, వంద రోజుల ప‌ని క‌ల్ప‌న‌ ల‌క్ష్యాల‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఇక‌నుంచీ ఈ ప‌నుల‌పై ప్ర‌తీరోజూ ఉద‌యం, సాయంత్రం రెండు పూట‌లా స‌మీక్షిస్తామ‌ని చెప్పారు.  క్షేత్ర స్థాయి లో ఖాళీగా నున్న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ లను వెంటనే పూరించడానికి అవసరమగు చర్యలు తీసుకోవాలని డ్వామ పి.డి. శారదా దేవికి ఆదేశించారు.