చిన్న శిర్లాం ఉచిత పశు వైద్య శిబిరం.
30-01-2025 19:18:49
చిన్న శిర్లాం ఉచిత పశు వైద్య శిబిరం.
రేగిడి జనవరి 30 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్
రేగిడి ఆమదాల వలస చిన్నశిర్లాం గ్రామంలో వెటర్నరీ డాక్టర్ ఎం.దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ సాధారణ కేసులు162,గర్భకోశచికిత్సలు24,నట్టల నివారణ మందులు 148 ఆవులకి,38 దూడలకి వేసామని అన్నారు, ఈ పశు వైద్య శిబిరానికి జిల్లా ప్రత్యేకాధికారి. ఆర్, చిన్నయ్య , జిల్లా సంయుక్త సంచాలకులు వై.వి.రమణ, రాజాం సహాయ సంచాలకులు బి.జయప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ఈ పశు వైద్య శిబిరాలు మండలంలో వెటర్నరీ డాక్టర్లు బాగా నిర్వహించారని సంతృప్తి వ్యక్తం చేశారు,ఈ పశు వైద్య శిబిరాలకి సచివాలయ సిబ్బంది సహకరించాలని కోరారు, ఈ కార్యక్రమంలో విలేజ్ వెటర్నరీ అసిస్టెంట్ మరియు రైతులు, సచివాల సిబ్బంది పాల్గొన్నారు.