Sidebar


Welcome to Vizag Express
సిబ్బందికి రక్షణ కల్పించాలని డిఎస్పీని కోరిన విద్యుత్ అధికారులు

30-01-2025 20:48:00

సిబ్బందికి రక్షణ కల్పించాలని డిఎస్పీని కోరిన విద్యుత్ అధికారులు: నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30: 

విద్యుత్ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని,ఏపీ ట్రాన్స్ కో అధికారులు నర్సీపట్నం డి.ఎస్.పి పోతురెడ్డి శ్రీనివాసరావును కోరారు. ఈ మేరకు గురువారం అధికారులు డీఎస్పీ ని ఆయన కార్యాలయంలో కలిసారు. మంగళవారం రాత్రి విద్యుత్ జూనియర్ లైన్ మెన్ కిషోర్, హెల్పర్ శ్రీనివాసరావు లపై దాడికి సంబంధించిన సంఘటన వివరాలను చర్చించారు. విధి నిర్వహణలో ఉన్న తమ సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరారు. దీంతో ప్రజలకు సేవలు అందజేస్తున్న విద్యుత్ సిబ్బందికి పోలీసులు అండగా ఉంటారని డి.ఎస్.పి  హామీ ఇచ్చారు. ఇప్పటికే నిందితులను అదుపులో తీసుకున్నామని, మరి కొందరు నిందితులను గుర్తించామని, వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని డి.ఎస్.పి  శ్రీనివాసరావు తెలిపారు. ఎలక్ట్రికల్ డి. ఈ వి.డి.వి రామకృష్ణారావు, టౌన్ ఏ. డి.ఈ కె.త్రినాథ్ రావు, నర్సీపట్నం టౌన్ ఏ.ఈ మనోజ్ కుమార్. లైన్ ఇన్స్పెక్టర్లు,సిబ్బంది పాల్గొన్నారు.