Sidebar


Welcome to Vizag Express
వైఎస్ఆర్సిపి పార్టీ పెద్దలను సాలువాలు కప్పి సత్కరించిన లోచల సుజాత

31-01-2025 19:07:55

వైఎస్ఆర్సిపి పార్టీ పెద్దలను సాలువాలు కప్పి సత్కరించిన  లోచల సుజాత 

 గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 31:
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుండి వైయస్సార్సీపి  మహిళా విభాగ అధ్యక్షురాలుగా స్థానిక మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్  దీవెనలతో ప్రస్తుత జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులుబూడి ముత్యాల నాయుడు  ఆశీర్వాదాలుతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియమింపబడ్డ గొలుగొండ మండలం ఏ ఎల్ పురం మేజర్ పంచాయతీ సర్పంచ్ లోచల సుజాతను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శాసన మండలి సభ్యురాలు  వరద కళ్యాణి ని రాష్ట్ర వైఎస్ఆర్ సీ పీ కార్యదర్శి మాజీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడు ప్రసాద్  చోడవరం మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ నూతన అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా నియమింపబడ్డ కరణం ధర్మశ్రీని దుస్సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియపరిచారు.దీనికిగాను ఆమె స్పందిస్తూ నేను ఈ స్థాయికి రావడానికి కారకులైన ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెట్లఉమాశంకర్ గణేష్ కి కృతజ్ఞతలు  ధన్యవాదాలు తెలియపరస్తూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని తెలియపరిచారు