Sidebar


Welcome to Vizag Express
ఘనంగా ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాలు

31-01-2025 19:13:29

ఘనంగా ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాలు పెదగంట్యాడ - వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 31 జీవీఎంసీ 76వ వార్డు పరిధినడుపూర్ లో వెలిసిన సంకటమోచన గణపతి ఆలయంలో శుక్రవారం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా హోమాలు, జలధివాసం, ప్రత్యేక అభిషేకాలు పూజలు, ధ్వజస్తంభ ప్రతిష్టలు జరిగాయి. మూడు రోజులు పార్టీ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ధర్మకర్త లు మంత్రి నరసింహమూర్తి, మంత్రి శంకర్ నారాయణ లు తెలిపారు. ఆదివారం భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, వైసిపి గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, ఎమిలీ జోల దంపతులు, ఇంటర్ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ దంపతులు, మమ్మును మురళి, పల్లా చిన్న తల్లి, మామిడి రంగనాథ్, మంత్రి రూప, భాస్కర్ ప్లాస్టిక్స్, అన్నపు రవిచంద్ర, సాయి కీర్తి, ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.