Sidebar


Welcome to Vizag Express
నా బిడ్డను నాకు ఇప్పించండి మహాప్రభో ఓ తల్లి ఆవేదన హైవే నిర్బంధం

31-01-2025 19:15:02

నా బిడ్డను నాకు ఇప్పించండి మహాప్రభో
 ఓ తల్లి ఆవేదన
 హైవే నిర్బంధం

భీమిలి రూరల్, వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 31:

కన్న బిడ్డ కోసం ఓ తల్లి జాతీయ రహదారి దిగ్బంధనం
 చేసింది.భర్త, బావ,అత్త వేధింపులు తో పాటు కన్న బిడ్డను నెలల తరబడి చూపించకపోవడం ఓవైపు,మరోవైపు కుమార్తె కాపురం సక్రమంగా లేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఓ తండ్రి.భీమునిపట్నం మండలం టి నగరపాలెం కు చెందిన బొట్ట యామిని(26)ని సంగివలసకు చెందిన అక్కరమాని చంద్రశేఖర్ తో పెద్దల సమక్షంలో గత ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడున్నర ఏళ్ల అక్కరమాని గీతాన్ష్ అనే కుమారుడు ఉన్నాడు. గత మూడేళ్లుగా యామినికి భర్త, బావ, అత్త ల నుండి వేధింపులు తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో యామిని ఏడాది క్రితం ఆత్మహత్యాయత్నం చేసింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స సమయంలో అత్తవారికి ఉన్న పలుకుబడితో ఎటువంటి కేసు నమోదు కాకుండా జాగ్రత్తపడ్డారు. పెద్దల సమక్షంలో రాజి ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేదు. దీంతో యామిని అప్పటినుండి పుట్టింటి వద్దే తన కుమారుడు గీతాన్ష్ తో ఉంటుంది. ఆ సమయంలో  పదిరోజులకోమారు తన భర్త చంద్రశేఖర్ తన కుమారుడిని తీసుకుని వెళ్లి తీసుకొస్తూ ఉండేవాడని బాధితురాలు తెలిపింది. ఓసారి తన భర్త చంద్రశేఖర్  ఇంటికి వచ్చి తనతో పాటు తల్లిదండ్రులను కొట్టడంలో పాటు నానా దుర్భాసలాడి తన కుమారుడిని బలవంతంగా లాక్కొని వెళ్లిపోయాడని రోదించింది. ఎన్ని రోజులైనప్పటికీ తన కుమారుడిని తీసుకురాకపోవడంతో యామిని తల్లిదండ్రులు అల్లుడిని ప్రశ్నించారు. మీకు దిక్కున్నచోట చెప్పుకోండి.... తన బిడ్డ ను తీసుకురానంటూ ఖరాకండిగా  భర్త చంద్రశేఖర్ తెలిపాడని రోధించింది.  దీంతో తన తండ్రి బొట్ట శ్రీనివాసరావు నిత్యం మదన పడేవాడన్నారు.తన కాపురం కళ్ళముందే చెడిపోవడం, మనవడు దూరం కావడంతో మనస్థాపానికి గురై తండ్రి సుమారు 40 రోజుల క్రితం స్వగ్రామమైన నెల్లూరు జిల్లా కలిగిరి గ్రామంలో మరణ వాంగ్మూలం  వ్రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని బాధితురాలు కన్నీరు మున్నీరయింది. నెల్లూరు నుండి మృతదేహాన్ని టి నగరప్పాలెం తీసుకువచ్చి తనతో పాటు బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. ఆ సమయంలో పోలీసులు చేరుకుని వారం రోజుల వ్యవధిలో తన బిడ్డను అప్పగిస్తామని హామీ ఇవ్వడంతో అదే రోజు సాయంత్రం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించామన్నారు. ఘటన జరిగి సుమారు 40 రోజులు అయినప్పటికీ తన బిడ్డను తన వద్దకు చేర్చక పోగా తన భర్త, బావ, అత్తలకు బెయిల్ మంజూరవడంతో యామిని ఆగ్రహించి , బంధువులు గ్రామస్తులతో కలిసి జాతీయ రహదారిని కొద్దిసేపు దిగ్బంధం చేసింది. దీంతో వాహనాలు కొంత మేర నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని జాతీయ రహదారిని దిగ్బంధం సరైనది కాదని ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని నచ్చజెప్పారు. దీంతో జాతీయ రహదారిని ఖాళీ చేశారు.