Sidebar


Welcome to Vizag Express
గుడి దారి కబ్జాపై గ్రామస్తుల నిరసన

31-01-2025 19:16:08

గుడి దారి కబ్జాపై గ్రామస్తుల నిరసన

 భీమిలి రూరల్ వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్ జనవరి 31: భీమిలి మండలం సంగివలస గ్రామం దుర్గాలమ్మ అమ్మవారి గుడి దారిని కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు నిరసన తెలిపారు.పూర్వం నుంచి వలందపేట ఊరిలో  నుండి సంగివలస మధ్యలో ఉన్న దుర్గాలమ్మ గుడికి రహదారి ఉండేది. ఈ రహదారిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి అమ్మి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.ఈ మేరకు  జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం స్పందించి గుడికి వెళ్లే దారిని కాపాడాలని కోరారు.