Sidebar


Welcome to Vizag Express
గంటాను అభినందించిన నాగోతి నాగమణి...!

31-01-2025 19:17:25

గంటాను అభినందించిన నాగోతి నాగమణి...!
  
 ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, జనవరి,31

 సింహాచలం పంచ గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా కృషిచేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును టిడిపి యువ నాయకురాలు నాగోతి నాగమణి అతని స్వగృహంలో శుక్రవారం కలుసుకొని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సరైన న్యాయం చేశారన్నారు. ఎన్నో ఏళ్లుగా మొండి సమస్యగా నలుగుతున్న పంచ గ్రామాల భూ సమస్య ను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది అన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆ సమస్యను సవాల్ గా  తీసుకొని ఇరువర్గాల వారు కోర్టు కేసులను రద్దు చేసుకునేలా ఒప్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీంతో 92 వేల కుటుంబాలకు ఊరట కలిగిందన్నారు. ఈ సందర్భంగా నాగోతి నాగమణి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.