Sidebar


Welcome to Vizag Express
మాధవ స్వామి ఆలయంలో మొదలైన మాఘమాస ఉత్సవాలు

31-01-2025 19:18:47

మాధవ స్వామి ఆలయంలో మొదలైన మాఘమాస ఉత్సవాలు 

మాధవధార , వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 31:.మాధవధారలో గల లీలా మాధవస్వామి ఆలయంలో గురువారం నుంచి మాఘమాస మహోత్సవాలు నిర్వహించనునట్లు ఆలయ అర్చకుడు సనపల రవీంద్ర కుమార్ తెలిపారు.జనవరి 30 నుంచి ఫిబ్రవరి 28వరకు విశేష పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలో నాలుగు ఆదివారాలలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఫిబ్రవరి 8న లీలా మాధవస్వామి కళ్యాణం, అనంతరం తిరువీధి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 10న సదస్యం,ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి,ఫిబ్రవరి 26న మహాశివరాత్రి,ఫిబ్రవరి 28న మాఘా అమావాస్య  నిర్వహించనున్నారు.