Sidebar


Welcome to Vizag Express
ఏటీఎంలో నగదు దొంగిలించేందుకు యత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు..

31-01-2025 19:21:17

ఏటీఎంలో నగదు దొంగిలించేందుకు యత్నం..
పోలీసుల అదుపులో నిందితుడు..

ఎన్ఏడి -వైజాగ్ ఎక్స్ప్రెస్. జనవరి 31: మద్యం మత్తులో ఏటీఎంలోని నగదు దొంగిలించేందుకు యత్నించి వ్యక్తిని పోలీసులు తక్షణమే స్పందించి 24 గంటల్లో పట్టుకొని అరెస్ట్ చేశారు. కంచరపాలెం క్రైం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కంచరపాలెం ప్రాంతానికి చెందిన పైడి సంతోష్ కుమార్ (30) గురువారం వేకువ జామున సుమారు రెండు గంటల సమయంలో  మధ్యం మత్తులో మాధవధార ప్రధాన రహదారిలోని ఎస్ బీఐ ఏటీఎంలో నగదును దొంగిలించేందుకు వెళ్లాడు. ఏటీఎం యంత్రం తెరిచేందుకు  తీవ్రంగా ప్రయత్నించగా ముంబయి లోని  కమాండ్  కంట్రోల్    రూం కీ  సందేశం వెళ్లింది. వెంటనే వారు విశాఖ సీపీకి సమాచారం ఇవ్వడంతో, సీపీ కంచరపాలెం క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రైం ఏసీపీ లక్ష్మణ రావు, సీఐ శ్రీనివాసరావు సంఘటనా ప్రాంతా నికి చేరుకొగా సంతోష్ కుమార్ అప్పటికే అక్కడ నుంచి పరారయ్యాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టి  సంతోష్ కుమార్  ను 24 గంటలలోపే అదుపులోకి తీసుకొని  రిమాండ్ కు తరలించారు. నిందితుడు పై గతంలో ఎయిర్ పోర్టు క్రైం పోలీసు స్టేషను లో కేసు నమోదైనట్లు  శుక్రవారం కంచరపాలెం  క్రైం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో  క్రైం ఎడిసిపి మోహనరావు వెల్లడించారు. కేసు త్వరిత గతిన పూర్తి చేసిన వెస్ట్ సబ్ డివిజన్ సీఐ నిమ్మకాయల శ్రీనివాసరావు, ఇతర సిబ్బందికి ప్రత్యేకంగా అభినందించారు.