Sidebar


Welcome to Vizag Express
ఏరు దాటి తెప్ప తగలబెట్టిన చంద్రబాబు, వ్యాఖ్యానించిన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గీ రెడ్డి

31-01-2025 19:22:40

ఏరు దాటి తెప్ప తగలబెట్టిన చంద్రబాబు, వ్యాఖ్యానించిన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గీ రెడ్డి 

కొత్తపేట, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 31:
రావులపాలెం మండలం వైసీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కొత్తపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మీడియా సమావేశం  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గడిచినటువంటి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు చెప్పిన  సూపర్ సిక్స్, హామీలు నమ్మి , ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మరిచారని, ఏరు దాటి తెప్ప తగలబెట్టిన నాయకుడుగా చంద్రబాబు మిగిలాడని, రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి, నిధులన్నీ పసుపు చొక్కా నేతలకి పంచె కార్యక్రమం పెట్టారని అన్నారు. ప్రభుత్వం నాలుగో స్తంభమైన మీడియా ముఖంగా ఆనాడు నారా లోకేష్, సూపర్ సిక్స్ హామీలతో పాటు, మరో 31 హామీలను నెరవేరుస్తామని, అమలు చేయని పక్షంలో ప్రజలు మా చొక్కా కాలర్ పట్టుకుని అడగమని అన్నాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలను నెట్టింట ముంచారని అన్నారు.  ప్రపంచంలో ప్రజల్ని నట్టి ఇంట ముంచే వారిని 420 అంటారంటూ ఎద్ధెవ చేశారు. అంత ఘోరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారా? సంపద సృష్టించడమంటే వంట నూనె ధరలు, విద్యుత్ చార్జీలు, పెంచడమా? అంటూ ప్రశ్నించారు. రాబోయే కాలంలో మోసపూరితమైన ముఖ్యమంత్రిగా చరిత్రలో లేకుండా సరి చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మీడియా ద్వారా కోరారు. ఈ సమావేశంలో మాజీమంత్రి, గొల్లపల్లి సూర్యారావు, గొల్లపల్లి డేవిడ్,మార్గాని గంగాధర్, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.